ఎంతకు తెగించార్రా.. ఏకంగా సుప్రీంకోర్ట్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్, సీజేఐ జాగ్రత్తలు
Send us your feedback to audioarticles@vaarta.com
కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, వ్యక్తులు, బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాల మార్గాల్లో విలువైన డేటాను సేకరిస్తున్న కేటుగాళ్లు.. కోట్లాది రూపాయలను దోచేస్తున్నారు. ఈసారి ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే నేరగాళ్లు టార్గెట్ చేశారు. సుప్రీంకోర్టు పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు. అంతేకాదు.. ఆ ఫేక్ వెబ్‌సైట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని న్యాయవాదులు, ప్రజలను ఆయన హెచ్చరించారు . దీనిపై సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ సైతం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.
సుప్రీంకోర్ట్ నోటీసులో ఏముందంటే :
సర్వోన్నత న్యాయస్థానం పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు రూపొందించారు. రెండు యూఆర్ఎల్‌లను కూడా డెవలప్ చేశారు. వీటి సాయంతో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఎవరూ షేర్ చేయొద్దు.. ఎలాంటి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ ఎప్పుడూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, రహస్య వివరాలు, ఆర్ధిక లావాదేవీల గురించి అడగదు అని రిజిస్ట్రీ పేర్కొంది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ :
సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా WWW.SCI.GOV.IN డొమైన్‌తో రిజిస్టర్ అయి వుంది. దీని పేరుతో ఏదైనా నకిలీ యూఆర్ఎల్ గనుక వస్తే దానిని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్‌తో సరిచూసుకోండి. ఏదైనా సైబర్ దాడికి గురైనట్లుగా అనుమానమొస్తే.. వెంటనే మీ ఆన్‌లైన్ ఖాతాలు, బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ సూచనలు చేసింది. ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments