పవన్‌కు జెడ్ కేటగిరి భద్రత అంటూ న్యూస్ వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతను కల్పించిందంటూ ఓ న్యూస్ ఆదివారం తెగ వైరల్ అయింది. చివరకు ఆ న్యూస్ ఫేక్ అని తేలింది. అలాంటి డెసిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. ఒకవేళ పవన్‌కు ఏమైనా అపాయం పొంచి ఉంటే అలాంటి సెక్యూరిటీని కేంద్రం ఇస్తుంది. జెడ్ కేటగిరి సెక్యూరిటీ అనేది టెర్రరిస్టుల నుంచి లేదంటే నక్సలైట్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులకు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.
కాగా కొందరు పవన్ ఫ్యాన్సే ఇలాంటి ఫేక్ న్యూస్‌ని క్రియేట్ చేసి అది తమ నేత గొప్పతనంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు తెలుస్తోంది. విషయం కాస్తా.. జనసేన పార్టీ దృష్టికి వెళ్లడంతో ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వైరల్ చేస్తే అది తమ పార్టీ క్రెడిబులిటీకి పెద్ద డ్యామేజ్‌కి మారుతుందని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. వెంటనే దీనిపై పార్టీ క్లారిటీ ఇచ్చింది. అది ఒక ఫేక్ న్యూస్‌గా కొట్టిపారేసింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉంటున్నారు.
పవన్ ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. ఈ నెల 15 నుంచి థియేటర్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. దీంతో అన్ని చిత్రాలు ఇప్పుడిప్పుడే షూటింగ్‌ను ప్రారంభించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ కూడా ఈ నెలాఖరుకో లేదంటే వచ్చే నెలలోనో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout