BiggBoss: బరువు మోయలేక రేవంత్, శ్రీహాన్ ఆపసోపాలు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచిన ఫైమా
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ వారం బిగ్‌బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రైజ్‌మనీలో కోత పెట్టే పని మొదలెట్టిన బిగ్‌బాస్ అందినకాడికి కట్ చేశాడు. ఈ టాస్క్ అందరినీ అలరించింది. ఇక నిన్నటి వరకు జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి రేవంత్ రెండోసారి కెప్టెన్‌గా అవతరించాడు. ఈ రోజు కూడా బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ సాధించుకోవడానికి పరీక్ష పెట్టాడు. అంతేనా ఇక్కడా తన డబ్బులు మిగుల్చుకునే స్కెచ్ వేశాడు బిగ్‌బాస్. ఎవిక్షన్ పాస్ కావాలంటే ముందుగా బజర్ నొక్కాలని అలాగే దానికి నగదు వెచ్చించాలని ఈ మొత్తం ప్రైజ్‌మనీలో నుంచి కట్ అవుతుందని కండీషన్ పెడతాడు బిగ్‌బాస్.
టాస్క్ మొదల్వగానే ముందుగా బజర్ నొక్కి ఫైమా , రేవంత్, శ్రీహాన్‌లు ఈ పాస్ కోసం పోటీపడ్డారు. అనంతరం బిగ్‌బాస్ వీరికి కాడెలు మోసే టాస్క్ ఇచ్చారు. ఈ ముగ్గురికి ఇంటి సభ్యులు మద్ధతు తెలిపాల్సి వుంటుంది. టాస్క్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో వారు ఎత్తుకున్న కర్రలపై బరువు వుంచాలి. అందరి సపోర్ట్ ఫైమాకే దక్కగా... శ్రీహాన్, రేవంత్‌లు కాడెలు మోయలేక కుప్పకూలారు. ఫైమా కాడెపై రెండు బ్యాగ్స్ మాత్రమే వుండగా.. రేవంత్ కాడెపై దాదాపు 10 బ్యాగ్స్ వుండటంతో వాటిని మోయలేక అపసోపాలు పడ్డాడు. మొత్తంగా ఇంటి సభ్యుల మద్ధతుతో ఫైమా విజేతగా నిలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సొంతం చేసుకుంది.
ఇక ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శ్రీసత్య - శ్రీహాన్‌ల గురించి. శ్రీసత్య కోసం శ్రీహాన్ పులిహోర కబుర్లు చెప్పాడు. గతంలో వీరిద్దరి గురించి ఇనయా కామెంట్స్ చేసినప్పడూ... ఇద్దరు కలిసి ఆమె మీదకు దూసుకెళ్లారు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే అది నిజమేనని అనిపిస్తుంది. కాడెలను మోసే టాస్కులో శ్రీహాన్ కుప్పకూలిపోవడంతో వెంటనే శ్రీసత్య అతనిని పైకి లేపి, ఒళ్లో కూర్చోబెట్టుకుని ఓదార్చింది. ఈ టాస్క్‌లో ఎవిక్షన్ పాస్ సంపాదించి శ్రీసత్యను నామినేషన్స్ నుంచి తప్పించాలని మనోడు ట్రై చాలా ట్రై చేశాడు. బజర్ నొక్కేటప్పుడు కూడా స్క్రీన్ మీద రూ.1,50,000 కనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా బజర్ ప్రెస్ చేశాడు. ఎందుకు అలా చేశావని శ్రీసత్య అడగ్గా.. ఒక వారమైనా నువ్వు నాతో వుంటావు కదా అంటూ పులిహోర మొదలుపెట్టాడు. నీ వాల్యూ కంటే రూ.1,50,000 తక్కువే కదా అని .. అవసరమైతే రూ.2,00,000 కట్ చేసినా పర్లేదంటూ డైలాగ్స్ చెబుతాడు. ఆ మాటకి శ్రీసత్య ముసిముసి నవ్వులు నవ్వుతుంది.
అటు చెప్పుకోవాల్సిన మరో క్యారెక్టర్ ఆదిరెడ్డి. బిగ్‌బాస్ ప్రైజ్ మనీ కట్ చేస్తూ పోతుండటంతో మనోడు జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను టాస్కుల్లో డబ్బు ఖర్చు పెట్టి ఆడలేనంటూ ఓ మూలకెళ్లి కూర్చుంటున్నాడు. ఇది ఏమాత్రం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో బజర్ నొక్కాల్సినప్పుడు నా వల్ల కాదంటూ సైడ్ అయ్యాడు. బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు పాల్గొనాలి కదా అని ఇనయా చెప్పిచూస్తే.. తలా తోకా లేకుండా సమాధానం ఇచ్చాడు. తాను ఆడకూడదు అనుకోవడం కూడా టాస్క్‌లో భాగమేనంటూ ఆన్సర్ చెప్పాడు. మనోడికి నాగార్జున చేతిలో క్లాస్ పడితే కానీ మారేలా లేడు. అన్నట్లు రేపు వీకెండ్ కావడంతో నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎవరికి క్లాస్ పడుతుందో.. మరెవరికీ కాంప్లిమెంట్స్ వస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments