BiggBoss: కొత్త కెప్టెన్‌గా ఫైమా... వరెస్ట్ పర్ఫార్మర్‌గా ఇనయా
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగులో కెప్టెన్సీ టాస్క్ హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్‌లో రోహిత్- రేవంత్ మధ్య ఓ రేంజ్‌లో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. సంచాలక్‌గా రేవంత్ రూల్స్‌కి మనోడికి చిర్రెత్తుకొచ్చింది. టాస్క్ ఈరోజు కూడా కొనసాగగా... చివరికి ఫైమా, శ్రీసత్య, ఆదిరెడ్డి మాత్రం మిగిలారు. ఇనయాని ఆదిరెడ్డి మళ్లీ టార్గెట్ చేశాడు. మీరిద్దరూ కలిసి ఆడారంటూ ఫైమా- ఆదిరెడ్డిలపై ఇనయా కామెంట్ చేసింది. అంతే ఆదిరెడ్డి ఇనయా మీదకు దూసుకొచ్చాడు. ‘‘ఏందే ’’ అంటూ మన నెల్లూరు యాసలో ఫైరయ్యాడు. నీకు కళ్లు నెత్తికెక్కాయి... బ్రెయిన్ వుందా అంటూ నానా మాటలు అన్నాడు. ఫైమా కూడా అయ్యో నీకు ఎవరూ సపోర్ట్ లేరా.. ఇంకా ఎన్నో రోజులు ఇంటిలో వుండవులే అంటూ దెబ్బిపొడిచింది.
టాస్క్‌లో ఫైనల్‌గా ఫైమా - శ్రీసత్య నిలవగా.. ఎక్కువ బరువున్న బస్తాను కలిగి వుండటంతో ఫైమా ఈ వారం కెప్టెన్‌గా గెలిచినట్లుగా రేవంత్ ప్రకటించాడు. అయితే ఇక్కడే ఇనయా చాలా హుందా ప్రవర్తించింది. తనను కెప్టెన్ కాకుండా అడ్డుపడినా.. చివరికి ఈరోజు గొడవ పడినప్పటికీ ఫైమాకు అభినందనలు తెలిపింది. అంతేకాదు.. ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేసింది. దీంతో ఫైమా ఎమోషనల్ అయ్యింది. ఇది చూసి షాకవ్వడం ఇంటి సభ్యుల వంతు అయ్యింది.
తర్వాత ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్‌ని ఎవరో తేల్చాల్సిందిగా ఇంటి సభ్యులను ఆదేశించాడు బిగ్‌బాస్. పాపం ఇక్కడా ఇనయాకు నిరాశే ఎదురైంది. ఎక్కువ మంది ఇంటి సభ్యులు వరస్ట్ పర్ఫార్మర్ స్టాంప్ గుద్దడంతో ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే కెప్టెన్ కాకున్నా... వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎంపికైనప్పటికీ ఇనయాకు ప్రేక్షకుల మద్ధతు వున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఆమెకు ఎవరి సపోర్ట్ లేదు... ఒంటరిగానే ఆడుతోంది. సూర్య ఎలిమినేషన్ ఎపిసోడ్ తర్వాత ఆమెను చాలా మంది దూరం పెడుతున్నాడు. అయినప్పటికీ తన మార్క్ చూపిస్తోంది ఇనయా. ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్‌లు ఈమెను ముందుకు సాగనివ్వడం లేదు. మూకుమ్మడిగా దాడి జరుగుతున్నా ఇనయా ధైర్యంగా ఆడుతోంది. ఈరోజు ఫైమా కెప్టెన్ అయ్యాక చోటు చేసుకున్న పరిణామాలతో ఇనయాపై చాలా మందికి ఇంప్రెషన్ ఏర్పడింది.
ఇకపోతే ఈ వారం బాలాదిత్య, మెరీనా, ఫైమా, వాసంతి, కీర్తి, ఇనయా, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్‌లు నామినేషన్స్‌లో వుండగా.. శ్రీసత్య, వాసంతి, రోహిత్‌లు సేఫ్ సైడ్ వున్నారు. గడిచిన రెండు వారాల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా వున్న సూర్య, గీతూలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం మరి ఎవరు ఇంటి ముఖం పడతారో వేచి చూడాలి. మరోవైపు.. ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈవారం కంటెస్టెంట్స్ ఆట తీరుపై ఆయన మార్కులు ఇవ్వనున్నారు. మరి ఎవరికి కాంప్లిమెంట్ దక్కుతుందో.. ఎవరికి క్లాస్ పడుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments