Fahadh Faasil:రివేంజ్ తీర్చుకోవడానికి రెడీ అయిన షెకావత్ సార్.. పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ లుక్ చూశారా
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న చిత్రం ‘‘పుష్ప 2’’. ఇప్పటికే తొలి పార్ట్ విజయవంతం కావడంతో పార్ట్ 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు మూవీ లవర్స్ ఫిదా కావడంతో పార్ట్ 2లో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ , గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా పుష్ప 2 నుంచి మరో అప్డేట్ వచ్చింది.
ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ లుక్‌ను విడుదల చేసింది. మంగళవారం ఆయన పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఈ ట్రీట్ ఇచ్చారు. గుండుతో, సిగరెట్ కాలుస్తూ వస్తున్న వున్న లుక్‌లో ఫహాద్ క్రూరమైన విలన్లా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్‌ను జాగ్రత్తగా గమనిస్తే ఆయన గుండు మీద గీత వుంది. అంతేకాదు.. ఒంటిపై డ్రెస్ లేకుండా ఓ జర్కిన్ వుంది. దీనిని బట్టి చూస్తే షెకావత్ సర్ .. పుష్పపై రీవెంజ్ తీర్చుకుంటాడా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పుష్ప 2 డైలాగ్ చెప్పాలంటూ ఫ్యాన్స్ గోల :
ఇటీవల ‘‘బేబీ’’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అర్జున్.. తన స్పీచ్ ముగుస్తుందనగా ‘పుష్ప 2’లోని డైలాగ్ కావాలంటూ ఫ్యాన్స్ గోల చేయడంతో వారి కోరికను మన్నించి ఓ డైలాగ్ వదిలారు . ‘‘ ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది.. పుష్పాగాడి రూల్'' అంటూ బన్నీ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్ ఈలలు, కేకలు పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనసూయ, సునీల్ , జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ భండారి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ , అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com