ఎన్టీఆర్ సినిమాలో ఫ్యాక్షన్ రాజకీయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కథానాయకుడిగా తారక్‌కు ఇది 28వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రాయలసీయ బ్యాక్‌డ్రాప్ చుట్టూ సాగే పొలిటికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది.
ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో సీనియర్ నటులు జగపతిబాబు, నాగబాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపించనున్నారని సమాచారం. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలే.. సినిమాలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబవుతోంది. హైదరాబాద్‌లో జరుగనున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 12న విజయదశమి కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments