ఎన్టీఆర్ సినిమాలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు

  • IndiaGlitz, [Saturday,May 05 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌థానాయ‌కుడిగా తార‌క్‌కు ఇది 28వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  రాయ‌ల‌సీయ బ్యాక్‌డ్రాప్ చుట్టూ సాగే పొలిటిక‌ల్ స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంద‌ని తెలిసింది.

ఫ్యాక్షన్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో సీనియ‌ర్‌ న‌టులు జగపతిబాబు, నాగ‌బాబు ఫ్యాక్షనిస్టులుగా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలే.. సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇటీవ‌లే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబవుతోంది. హైదరాబాద్‌లో జ‌రుగ‌నున్న ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, పూజా హెగ్డేపై కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. కాగా.. అక్టోబ‌ర్ 12న విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా  ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.