సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. మరి ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చింది ఎఫ్ 2. అటు వరుణ్ తేజ్ కెరీర్లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. వరుసగా ఐదు హిట్ల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌పై ఆదివారం అధికారిక ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా... తాజాగా చిత్రయూనిట్ షాకిచ్చింది. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఎఫ్ 3ని వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 'బొమ్మ ఎప్పుడు పడితే అప్పుడే మనకు నవ్వుల పండగ' అంటూ మూవీ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
‘ఎఫ్ 2’ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గంతోనే ‘ఎఫ్ 3’ కూడా తెరకెక్కించనున్నారు. ‘ఎఫ్ 3’లో అదనంగా మరో క్యారెక్టర్స్‌ని యాడ్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే ఇందులో సునీల్ కూడా నవ్వించబోతున్నాడని టాక్. ఇద్దరు హీరోయిన్స్‌తో పాటు సోనాల్ చౌహన్‌ని కూడా తీసుకున్నారు. పక్కా మసాలాతో, అన్ని రకాల ఎలిమెంట్స్‌తో సినిమాని మరింత కామెడీతో డిజైన్ చేశారని సమాచారం. దీంతో థియేటర్లలో నవ్వుల విందు భోజనం కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com