'ఎఫ్ 2' సెన్సార్ పూర్తి ...సంక్రాంతి విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సంక్రాంతి పండుగకు అల్లుళ్లమంటూ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు అయితే దిల్‌రాజు నిర్మాత. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది.
సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ సంక్రాంతికి వస్తున్న నాలుగు సినిమాలో ఎఫ్ 2 ఒకటి.. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి చేసిన చిత్రం కావడం.. సంక్రాంతి కూడా కలిసి రావడం.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా సినిమా ఉంటుందనడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సంక్రాంతికి దిల్‌రాజు ఎలాంటి సక్సెస్ అందుకోనున్నారో చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments