వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అయితే ధరణిలో మాత్రం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను ఆపాలని హైకోర్టు సూచించింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10వ తేదీ వరకూ స్టేను హైకోర్టు పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వుల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కాబట్టి.. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏజీ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. తామెప్పుడూ.. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలివ్వలేదని, పాత విధానంలో కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తామనే షరతు విధించిన తర్వాతే పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే.. ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments