వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు..

  • IndiaGlitz, [Wednesday,December 09 2020]

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అయితే ధరణిలో మాత్రం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను ఆపాలని హైకోర్టు సూచించింది. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10వ తేదీ వరకూ స్టేను హైకోర్టు పొడిగించింది. ఇటీవల ధరణి నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్‌శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా.. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వుల కారణంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కాబట్టి.. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏజీ కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. తామెప్పుడూ.. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలివ్వలేదని, పాత విధానంలో కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తామనే షరతు విధించిన తర్వాతే పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అయితే.. ధరణి పోర్టల్‌లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది.

More News

దీపికకు మరో అరుదైన గుర్తింపు

మన దక్షిణాది అమ్మాయి.. బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొనెకి అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది.

పవన్ ఎంట్రీతో నిహారిక పెళ్లి వేడుకలో మరింత జోష్...

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం సాయంత్రం జరగనుంది. అయితే మంగళవారం సాయంత్రం వరకూ ఒక లెక్క..

సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు.

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.