Telangana: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని చెప్పారు. ఇక 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక స్థానానికి 17 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు.
ఒక్కో ఈవీఎంలో 15 మంది అభ్యర్థుల సంఖ్యను పెట్టడానికి అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా రాష్ట్రంలో ఏడు స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. 15,970 సర్వీస్ ఓటర్లు ఉన్నారని.. వాళ్ల కోసం ఎలక్ట్రానిక్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక మే 3వ తేదీ నుంచి హోం ఓటింగ్ ప్రారంభం కానుందని.. అలాగే హైదరాబాద్‌లో మొత్తం 3,986 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని.. తొలిసారి ఓటర్లు 9.20 లక్షలుగా వెల్లడించారు. 2 లక్షల 45 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం.. హోం ఓటింగ్ కోసం 24,974 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. హోం ఓటింగ్ అప్లై చేసిన వాళ్లు ఇంటి దగ్గర అందుబాటులో ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో దాదాపు 2లక్షల 95వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. ఇందులో 60వేల మంది రాష్ట్ర పోలీస్, 20వేల ఇతర రాష్ట్రాల దళాలు అందుబాటులో ఉంటాయని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంది. అయితే ఎండల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని పెంచాలని రాజకీయ పార్టీలు కోరాయని తెలిపారు. దీంతో వారి విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇక ఇప్పటివరకు రూ.81కోట్ల నగదు, రూ.46 కోట్ల విలువైన లిక్కర్ , రూ.26 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని.. 7,185 మందిపై కేసులు నమోదు చేసినట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout