తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నాం : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మే-17తో ముగియనుండటంతో.. దాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. మే-29 వరకు అంటే కేంద్రం ప్రకటించిన దానికంటే ఇంకో 12 రోజుల ఎక్కువగా తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ మేరకు కొన్ని సడలింపులతో కూడిన లాక్ డౌన్ మార్గదర్శకాలను కేసీఆర్ వెల్లడించారు.
చాలా సీరియస్గా ఉంటుంది..
‘ఇదివరకటిలా కాకుండా ఇకపై రాత్రి పూట చాలా సీరియస్ కర్వ్యూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిల్లోనూ సాయంత్రం ఆరు గంటల వరకే అన్ని పనులు ముగించుకోవాలి. రాత్రి 7గంటల తర్వాత బయట కనిపిస్తే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది.. ఇంకాస్త ఓపిక పెడితే బయటపడతాం. కేంద్రం మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేస్తాం. దయచేసి 65 ఏళ్లు దాటిన వారు బయటికి రాకుండా చూసుకోండి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే 66 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. గృహ నిర్మాణాలకు సంబంధిత దుకాణాలు తెరుచుకుంటాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వందశాతం పనిచేస్తుంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్నిషాపులు తెరుచుకుంటాయి. షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6వరకు ఓపెనింగ్స్ ఉంటాయి. సిమెంట్, స్టీల్, ఎలక్ట్రికల్, హార్డ్ వేర్ షాపులకు అనుమితిస్తున్నాం. రెడ్ జోన్లలో మాత్రం ఎలాంటి షాపులు తెరిచేకి అనుమతి లేదు. ఈ నెల 15న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. రేపట్నుంచి వ్యవసాయ సంబంధిత షాపులకు అనుమతిస్తాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల లెక్కలివీ...:
రెడ్ జోన్ జిల్లాలు : హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్
ఆరెంజ్ జోన్లు జిల్లాలు : సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట్, సిరిసిల్ల, నల్గొండ, నిజామబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగాం, కొమురంభీం ఆసీఫాబాద్, నిర్మల్, గద్వాల్
గ్రీన్ జోన్లు జిల్లాలు : యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, ములుగు జిల్లాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments