MP Moitra:టీఎంసీ ఎంపీ మొయిత్రాపై బహిష్కరణ వేటు.. విపక్షాల ఆగ్రహం..

  • IndiaGlitz, [Friday,December 08 2023]

పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెను బహిష్కరించాలని డిమాంండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. అనంతరం నివేదికపై చర్చించేందుకు స్పీకర్‌ అనుమతినిచ్చారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలో నివేదికపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మొయిత్రా కోరగా స్పీకర్ నిరాకరించారు.

అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌.. సోమవారానికి సభను వాయిదా వేశారు. ఓటింగ్‌ సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తదితర ముఖ్య నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా విపక్ష నేతలపై పగ సాధించేందుకే చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని మొహువా మొయిత్రా మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఇది బీజేపీ అంతానికి నాంది అని సవాల్ చేశారు. విపక్షాలను అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల్లో తన ఇంటికి సీబీఐని పంపించి వేధిస్తారేమో అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

Chandrababu:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు.

Akbaruddin Owaisi:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

రేపటి(శనివారం) నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దీంతో అసెంబ్లీ తొలి సమావేశాల ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ నియమితులయ్యారు.

Former CM KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు సొంతింటి కష్టాలు.. ఎక్కడుండాలి..?

ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సీఎం హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్‌కు

KCR: కేసీఆర్ హెల్త్‌బులిటెన్ విడుదల.. ఏం చెప్పారంటే..?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రముఖుల శుభాకాంక్షలు

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు ఇతర సినీ,