'ఎక్స్ ప్రెస్ రాజా' సక్సెస్ అయిందని గర్వంగా చెబతున్నా - శర్వానంద్
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్, సురభి జంటగా నటించిన చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...
శర్వానంద్ మాట్లాడుతూ `బ్రహ్మాజీగారు ఓ కథ ఉంది వింటావా అని అడగటంతో కథ విన్నాను. ఈ సినిమా చేశాను. సక్సెస్ అయింది. సోమవారం కలెక్షన్స్ చూసిన తర్వాతే ఈ సినిమా సక్సెస్ అయిందని గర్వంగా చెబుతున్నాను. డైలాగ్స్ లేని ధనరాజ్ క్యారెక్టర్‌కు ఆడియెన్స్‌నుండి మంచి అప్లాజ్ వస్తుంది. అలాగే డ్యాన్సులు బాగా చేశానని అంటున్నారు. ఆ క్రెడిట్ అంతా కొరియోగ్రాఫర్స్‌దే. నిర్మాతలకు స్పెషల్ థాంక్స్`` అన్నారు.
మేర్లపాక గాందీ మాట్లాడుతూ `డ్యాన్స్ చేయాలనేంత ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో హీరో, నిర్మాతల్లో ఆనందం చూడాలనుకున్నాను. కార్తీక్ ఘట్టమనేని చాలా కష్టపడ్డాడు. సినిమా సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, ప్రవీణ్ లక్కరాజు, జెబి, రవిప్రకాష్, ధనరాజ్, నాగినీడు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com