జనవరి14న సంక్రాంతి కానుకగా 'ఎక్స్ ప్రెస్ రాజా'
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సురభి కథనాయికగా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్లీన్ ఎంటర్ టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఆడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సక్సెస్ ఫుల్ టీం నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులతో పాటు... చిత్ర పరిశ్రమలో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి ఊహించని విధంగా స్పందన లభించింది. ఈ వారంలోనే ఎక్స్ ప్రెస్ రాజా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ...
నిర్మాతలు మాట్లాడుతూ.... మా బ్యానర్ లో రన్ రాజా రన్ చిత్రంతో శర్వానంద్ మా కాంబినేషన్ సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ మా కాంబినేషన్ లో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రానికి సంభంధించిన ఫస్ట్ లుక్ నుంచి సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ వరకూ సూపర్ రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా వుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధి ఈచిత్రానికి దర్శకుడు. మరోసారి హిలేరియస్ ఎంటర్ టైనర్ అందించారు. హీరోయిన్ సురభి, శర్వానంద్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇటీవలే ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఆడియో సూపర్ హిట్ అయ్యింది. ప్రవీణ్ లక్కరాజు...కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్ అందించాడు. ఈ వారంలోనే ఎక్స్ ప్రెస్ రాజా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. మా బ్యానర్ నుంచి ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆరేంజ్ లోనే మా ఎక్స్‌ప్రెస్ రాజా వుంటుంది. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments