ఎక్సె ప్రెస్ రాజా ఫస్ట్ లుక్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎక్సె ప్రెస్ రాజా. ఈ చిత్రాన్ని వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంథీ తెరకెక్కిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శర్వానంద్ సరసన బీరువా ఫేం సురభి నటిస్తుంది. కమెడియన్ సప్తగిరి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని అందిస్తున్నారు.
దీపావళి కానుకగా ఎక్సె ప్రెస్ రాజా స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు...వరుస విజయాలు తర్వాత చేస్తున్న ఎక్సె ప్రెస్ రాజా శర్వానంద్ కి హ్యాట్రిక్ ఇస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com