'ఎక్స్ ప్రెస్ రాజా' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Sunday,December 20 2015]

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన అడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది.

థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీలను ప్రభాస్ విడుదల చేశారు. ఆడియో సీడీలను ప్రభాస్ విడుదల చేసి తొలి సీడీని దిల్ రాజుకు అందించారు. ఈ సందర్భంగా..

ప్రభాస్ మాట్లాడుతూ 'యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మా బ్యానర్ లాంటిది. వంశీ, ప్రమోద్ లు మంచి మిత్రులు. శర్వానంద్ బాగా నటించాడు. ఈ చిత్రం తనకు మరింత మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. మేర్లపాక గాంధీ చాలా క్లారిటీతో సినిమాను తెరకెక్కించాడు. ఎక్కడా ఎక్స్ ట్రా షాట్ ను చిత్రీకరించలేదని టాక్. చాలా మంచి కథ. ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాను పెద్ద సక్సెస్ చేయండి'' అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ 'ఈ సినిమాలో కథే హీరో. కథలోని ప్రతి క్యారెక్టర్ హీరోగాలాగానే ఉంటుంది. మంచి సినిమా చేశాం. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం'' అన్నారు.

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత హిట్ కొట్టి నెక్ట్స్ సినిమా చేయని దర్శకుల లిస్టులో నా పేరు ఉండేది. రెండేళ్ళు తర్వాత ఈ సినిమా కోసం శర్వానంద్ ను కలిశాను. కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చింది. తనని డైరెక్ట్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ బ్యానర్ లో సినిమా చేస్తే నిర్మాతలతో లవ్ పడిపోతారు. అంత ఫ్రీడం ఇచ్చి పనిచేయించుకుంటారు'' అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ 'ఈ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు చాలా మంచి చిత్రాలు చేస్తున్నారు. నాలాంటి నిర్మాతలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. శర్వానంద్, టీంకు ఆల్ ది బెస్ట్ అన్నారు.

ప్రవీణ్ లక్కరాజు ఈ బ్యానర్ లో పనిచేయడం నా డ్రీమ్. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మంచి పాటలు కుదిరాయి'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ 'సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను. ప్రవీణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సుజిత్, రాధాకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, వంశీ, ప్రమోద్, సుప్రీత్, ప్రభాస్ శీను, రఘు కారుమంచి, బన్ని వాసు, హరీష్ ఉత్తమన్, శ‌ర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంక‌ర్‌, ధనరాజ్ త‌దిత‌రులు న‌టించ‌గా..

ఈ చిత్రానికి మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫి - కార్తిక్ గట్టమనేని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్. ఎన్, ఎడిటర్ - సత్య.జి, లిరిక్స్ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో, డ్యాన్స్ - రాజు సుందరం, విశ్వ, రఘు, ఫైట్స్ - స్టంట్ జాషువా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - మేర్లపాక గాంధి.

More News

చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

రంగ‌నాథ్ వంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : బాల‌కృష్ణ‌

న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం.

తమిళ రీమేక్ ప్లాన్ లో నితిన్

తమిళ రీమేక్ ప్లాన్ లో ఉన్న యువ హీరో... ఎవరో కాదు క్యూట్ హీరో నితిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ అ ఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.