'ఎక్స్ ప్రెస్ రాజా 'ఆడియో డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఎక్స్ ప్రెస్ రాజా ఆడియో రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 19న హైదరాబాద్ లో ఈ వేడుక జరగనుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలను ఈ నెల 19న విడుదల చేస్తారు. రన్ రాజా రన్ తర్వాత శర్వానంద్ ఈ సంస్థలో నటిస్తున్న రెండో చిత్రమిది. సినిమా బాగా వచ్చిందని నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఆనందంగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న నాలుగో సినిమా ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఇప్పటికే మంచి స్పందన వస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments