రజనీ ఆరోగ్యం పై వివరణ.....
Tuesday, June 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా రజనీకాంత్ కు అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. రజనీ ఆరోగ్యం పై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతో రజనీ ఆరోగ్యం గురించి రజనీ సోదరుడు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని..ప్రస్తుతం కేవలం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారని తెలిపారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కబాలి రిలీజ్ టైమ్ కి రజనీకాంత్ అమెరికా నుంచి తమిళనాడు వస్తారని చెప్పారు. రజనీ పై ప్రేమ చూపించే అభిమానులందరికీ తమ కుటుంబం రుణపడి ఉంటుంది అని రజనీ సోదరుడు తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments