కబాలి ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసా..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన కబాలి ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. రజనీ సినిమా అంటే క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనికి తోడు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్ చేయడంతో ఎక్కడా చూసినా కబాలి గురించే టాపిక్. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కబాలి ఎంత కలెక్ట్ చేయనుంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. రిలీజ్ కి ముందే దాదాపు 200 కోట్లు బిజినెస్ చేసి కబాలి రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
అయితే..కబాలి ఎంత కలెక్ట్ చేయనుంది అనే విషయం పై కబాలి నిర్మాత కలై ఫులి ఎస్ థాను స్పందిస్తూ....కబాలి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది మా అంచన. బాహుబలి రికార్డ్ ను కబాలి బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అది కూడా రజనీ అభిమానుల్లో అన్ని వయసుల వాళ్లు ఉన్నారు. సో...ఖచ్చితంగా కబాలి 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. మరి...కబాలి నిర్మాత చెప్పినట్టు కబాలి 500 కోట్లు కలెక్ట్ చేస్తుందా..? బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేస్తుదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com