హుజుర్నగర్లో భారీగా పోలింగ్.. గెలుపెవరిదో తేల్చిసిన సర్వే!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలోని హుజుర్నగర్లో సోమవారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకట్రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ అంతా సాఫీగానే జరిగింది. స్వచ్ఛందంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. భారీగా పోలింగ్ నమోదైంది. ఇప్పటికే 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. చాలా మంది క్యూ లైన్లలో ఉండడంతో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే.. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
గెలుపెవరిదో!?
పోలింగ్ అయిపోయింది సరే.. ఇక మిగిలింది ఫలితమే. ఉత్కంఠభరితంగా సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..? కాంగ్రెస్ కంచుకోటలో ‘కారు’ పార్టీ జోరుందా లేదా..? ఇంతకీ కారు గెలుస్తుందా..? లేదా..? లేకుంటే మళ్లీ కాంగ్రెస్ గెలిచి కంచుకోటను నిలబెట్టుకుంటుందా..? అసలు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు? అనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో .. రాష్ట్రప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తమదంటే తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తేల్చేసిన సర్వే...!
అయితే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే ‘ఆరా’ అనే సర్వే సంస్థ గెలుపెవరిదో తేల్చేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని.. ఈ సంస్థ అభిప్రాయపడింది. కాగా.. గతంలో ఈ సర్వే సంస్థ పలు ఎన్నికల్లో ఫలితాలపై అంచనా వేయగా.. అన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో తాజా సర్వే కూడా అక్షరాలా నిజమవుతుందని సదరు సంస్థ చెబుతోంది. కాగా.. సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్కు 50.48 శాతం, కాంగ్రెస్కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు రావొచ్చని సంస్థ అభిప్రాయపడింది. అయితే.. ఈ సర్వే ఫలితాలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout