‘కేజ్రీ’కే ఢిల్లీ కిరీటం.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకూ 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. కాగా.. ఇప్పటి వరకూ ఇంకా క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటువేసేందుకు అధికారులు అనుమితిచ్చారు. కాగా.. ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తయిన వరకూ ఢిల్లీలో ఎవరిది పైచేయి?.. మళ్లీ చీపురు ఊడ్చేస్తుందా?.. బీజేపీని మరోసారి లోకల్‌ పార్టీ దెబ్బకొట్టబోతోందా?.. మోదీ, షా జాతీయ వాదం ఈ సారేమైనా పనిచేస్తుందా?.. అసలు ఢిల్లీ ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అలా పోలింగ్ ముగిసుందో లేదో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈ పోల్స్‌తో ‘ఢిల్లీ పీఠం’ ఎవరిదో తేలిపోయింది.

ఎగ్జిట్స్ పోల్స్ ఎవరికి పట్టం కట్టాయ్!
న్యూస్‌ ఎక్స్‌:-
ఆప్‌ 53-57
బీజేపీ 11-17
కాంగ్రెస్‌ 0-2

సుదర్శన్‌ న్యూస్‌:-
ఆప్‌ 42- 45
బీజేపీ 24- 28
కాంగ్రెస్‌ 2-3

టైమ్స్‌ నౌ:-
ఆప్‌- 44
బీజేపీ- 26

రిపబ్లిక్‌ టీవీ:-
ఆప్‌ 48-61
బీజేపీ 9-21
కాంగ్రెస్‌ 0-1

ఇండియా టీవీ:-
ఆప్‌ 44
బీజేపీ 26

ఎన్డీటీవీ:-
ఆప్‌ 49
బీజేపీ 20
కాంగ్రెస్‌ 1

ఏబీపీ-సీఓటర్‌:-
ఆప్‌ 49-63
బీజేపీ 05-19
కాంగ్రెస్‌ 4

కాగా.. ఈ నెల 11న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 2015లో 67.14 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. తాజాగా మాత్రం 58 శాతం నమోదైంది. కాగా.. ఆప్‌- బీజేపీ మధ్య తీవ్ర పోరు నెలకొంటుందేమో అనుకున్నప్పటికీ అబ్బే బీజేపీకి అంత సీన్లేదని ఎగ్జిట్ పోల్స్‌తో తేలిపోయింది. అయితే కాంగ్రెస్‌ ఒకప్పుడు ఢిల్లీని ఏలగా ఇప్పుడు మాత్రం ఒకటి రెండు స్థానాలకే పరిమితం కానుందని ఎగ్జిట్ పోల్స్‌లో రావడం గమనార్హం.