తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ గెలుపొందిన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ కు భారీ మెజారిటి తో గెలుపొందిన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేసారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిదులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్, శివాజీ రాజా, హీరో శ్రీకాంత్, సీనియర్ హీరో నరేష్ హాజరు అయ్యారు. భారీ మెజారిటీ తో గెలుపొందిన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
యూనియన్ అభివృద్దికి పాటుపడాలని సూచించారు. యూనియన్ ను అన్నిరకాలుగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా ఆర్ వెంకటేశ్వరరావు (బందరు బాబి), ప్రెసిడెంట్ గా అమ్మిరాజు కానుమిల్లి , కె. సతీష్ కోశాధికారి గా ప్రమాణస్వీకారం చేసారు. ఐకమత్యమే బలం - సమిష్టి కృషే బలం అనే నినాదం తో యూనియన్ అభివృద్దికి అహర్నిశలు పాటు పడతామని తెలిపారు. వీరితో పాటు డి. యోగానంద్ వైస్ ప్రెసిడెంట్, కుంపట్ల రాంబాబు వైస్ ప్రెసిడెంట్, సూరపనేని కిషోర్ జాయింట్ సెక్రటరీ, జీ. నాగేశ్వరరావు జాయింట్ సెక్రటరీ, బానయ్య. యం (బాను) ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీహెచ్ నగమధు ఆర్గనైజింగ్ సెక్రెటరి లుగా ప్రమాణస్వీకారం చేసారు.
వీరితో పాటు అంజయ్య. పి, బి.వి.వి. సత్యనారాయణ, జి. హరినాథ్, కె. రమేష్ వర్మ, కొర్రపాటి వెంకటరమణ, కె. సత్య శివకుమార్, యమ్. రామారావు, ఐ. లక్ష్మణరావు, ఆకుల ఉమా శంకర్ లు ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబెర్స్ గా ప్రమాణస్వీకారం చేసారు.
అత్యధిక మెజారిటీ తో గెలిపించినందుకు కార్యవర్గ సభ్యులు యూనియన్ మెంబెర్స్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. 560 సభ్యులు ఉన్న యూనియన్ అభివృద్దికి కలిసికట్టుగా పనిచేసి మేనిఫెస్టో లో పెట్టిన అన్నిటిని చేసి చూపిస్తామని తెలిపారు. ప్యానెల్ ను సపోర్ట్ చేసి సభ్యులకు అండగా నిలబడిన వారందరి నమ్మకాన్ని నిలబెడతామని, అందరి శ్రేయస్సుకు యూనియన్ కట్టుబడి ఉంటుందని కూడా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com