Sree Vishnu : ఇండస్ట్రీలో ‘‘బ్యాక్‌గ్రౌండ్‌’’ పై హీరో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Thursday,September 15 2022]

తన మార్క్ సినిమాలు చేస్తూ ఈ తరం నటుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కంటెంట్ వున్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీ విష్ణు. రిజల్ట్ ఎలా వున్నా ఆడియన్స్‌కి కొత్త తరహా కథలను పరిచయం చేయడంలో ఆయన ముందుంటారు. తాజాగా ఆయన నటించిన ‘అల్లూరి’ సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమైంది. దీంతో ఆయన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు శ్రీ విష్ణు. ఈ క్రమంలో ప్రముఖ మీడియా సంస్థ https://www.indiaglitz.com/కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

అందుకే థియేటర్లు దొరకవు :

ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్, బ్యాక్‌గ్రౌండ్‌ లాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పిన శ్రీవిష్ణు.. తనకు తానుగా ఒక్కో మెట్టు ఎక్కి రావడం బాగుందన్నారు. తన కెరీర్‌లో థియేటర్ల సమస్య కూడా ఎప్పుడు రాలేదని ఆయన తెలిపారు. కన్‌ఫ్యూజన్ వల్లే ఇలా జరుగుతుంది తప్పించి దీనికి వేరే కారణాలు వుండవని, పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యని అధిగమించవచ్చని శ్రీవిష్ణు అన్నారు.

అతను నా డూడ్ :

ఇక ఇండస్ట్రీలోని తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెబుతూ.. హీరో రామ్ వద్ద వున్నంత చనువు ఎవరితోనూ వుండదన్నారు. అందరి హీరోల నెంబర్లు తన వద్ద వున్నాయని, కానీ ఫోన్ చేయనని శ్రీవిష్ణు తెలిపారు. అందరి పేర్లను ‘గారు’ అనే సేవ్ చేసుకుంటానని .. ఒక్క కిశోర్ తిరుమలనే ‘‘డూడ్’’ అని పెట్టానని ఆయన చెప్పారు.

సెప్టెంబర్ 23న విడుదల కానున్న అల్లూరి :

కాగా.. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అల్లూరికి కన్నడ యువ దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ విష్ణు సరసన కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న అల్లూరికి హర్షవర్థన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని గెస్ట్‌గా తీసుకురావాలని భావిస్తున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.