నందమూరి హీరో - మెగా హీరో భారీ మల్టీస్టారర్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రూపొందనుంది. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. నందమూరి హీరో - మెగా హీరో క్రేజీ కాంబినేషన్లో రూపొందే ఈ భారీ మల్టీస్టారర్ ను డిసెంబర్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. నందమూరి హీరో - మెగా హీరో తొలిసారి కలిసి చేసే మల్టీస్టారర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments