చైతు ప్రేమమ్ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..

  • IndiaGlitz, [Friday,August 05 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.
ఇటీవ‌ల ఈ చిత్రం కోసం నార్వేలో చైత‌న్య‌, శృతిహాస‌న్ పై పాట‌లు చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.ఇక ప్రేమ‌మ్ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్ ఏమిటంటే... కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు కానుక‌గా ప్రేమ‌మ్ ఆడియోను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రేమ‌మ్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 16న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.మ‌రో ముఖ్య విష‌యం ఏమిటంటే...ఈ చిత్రంలో వెంకీ గెస్ట్ రోల్ చేస్తుంటే...నాగ్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌డం విశేషం. మ‌రి...మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమ‌మ్ తెలుగులో కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం.

More News

బ‌హుబ‌లి 2 రిలీజ్ డేట్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ 2017 ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో 'బొమ్మలరామారం'

సినిమా ప్రమోషన్స్ లో కొత్త విధానానికి ఇప్పుడు నిర్మాతలు శ్రీకారం చుడుతున్నారు.

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల- దిల్ రాజు చిత్రం షూటింగ్ రేపు ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది.

హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.