అఖిల్ ఆడియో ఫంక్షన్... ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం కానున్న మరో సంచలన కథానాయకుడు అఖిల్. నాగార్జున.. అఖిల్ తొలి చిత్రాన్ని కథకి ప్రాధాన్యం ఇస్తూ... భారీ కథతో సోషియా ఫాంటసీ మూవీగా ప్లాన్ చేయడం విశేషం. అక్కినేని జయంతి సందర్భంగా ఈ నెల 20న అఖిల్ ఆడియో ఫంక్షన్ ను కనివినీ ఎరుగని రీతిలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అఖిల్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి.. అఖిల్..ఆడియో ఎలా ఉంటుంది..? ఆడియో ఫంక్షన్ ఎలా జరగనుంది..? ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథి ఎవరు..? సినిమా రిలీజ్ ఎప్పుడు...ఇలా.. చాలా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానమే
అఖిల్ ఆడియో ఫంక్షన్ లో ఏం జరగనుంది..? మేము అందిస్తున్న ఎక్స్ క్లూజివ్ డీటైల్స్...మీకోసం..
అఖిల్ ఆడియో ఫంక్షన్ కు అతిధి మహేష్..
అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారు..? ఈ విషయం పై అటు అభిమానుల్లో...ఇటు ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే అఖిల్ మూవీ ఆడియో ఫంక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ ఆడియో వేడుకలో మహేషే...అఖిల్ ను వేదిక పై తీసుకువస్తాడట. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అఖిల్ ఆడియో ఫంక్షన్ కి వ్యాఖ్యాతగా నితిన్ అలరించనున్నాడట. అలాగే స్టేజ్ పై అఖిల్, నితిన్ డాన్స్ చేయనున్నట్టు సమాచారం..
అఖిల్ ప్లాటినం డిస్క్ కు పవన్..
అఖిల్ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా పవన్ వస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. పవన్ కూడా అఖిల్ ఆడియో ఫంక్షన్ కు రావాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వలన ఆడియో ఫంక్షన్ కు రావడం లేదు. అఖిల్ మూవీ ప్లాటినం డిస్క్ వేడుకకు పవన్ వస్తున్నారు. ఈ వేడుకను అభిమానుల సమక్షంలో రాజమండ్రి లేక వైజాగ్ లో ప్లాన్ చేస్తారట. అఖిల్ మూవీ డైరెక్టర్ వి.వి.వినాయక్ పుట్టినరోజైన అక్టోబర్ 9న ప్లాటినం డిస్క్ వేడుక చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com