CM Jagan:సీఎం జగన్ విద్యా సంస్కరణలకు అద్భుతమైన ఫలితాలు

  • IndiaGlitz, [Thursday,April 11 2024]

ఏపీ సీఎంగా వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పేద విద్యార్థుల భవిష్యత్‌కు గట్టి పునాది వేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు మంచి చదువు చెప్పిస్తే చాలు వారే ఉన్నత శిఖరాలకు చేకుంటారని సీఎం జగన్ ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకే తగ్గట్లే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విద్యావ్యవస్థలో తాను చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలను, అందులోని విద్యా బోధనా తీరుతెన్నులను అమాంతం మార్చేసిన సీఎం జగన్ పేదల ఇళ్లలో విద్యా కుసుమాలు పూయిస్తున్నారు. నాడు- నేడు పేరిట వేలాది పాఠశాలలను ఆధునీకరించడమే కాకుండా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. టోఫెల్ శిక్షణను సైతం అందిస్తూ పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు, దీంతో అంతర్జాతీయ వేదికలతో పాటు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లోనూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు తమ ప్రతిభ చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్షకు ఆంధ్ర రాష్ట్రం నుంచి లక్షల మంది పిల్లలు హాజరై తమ ప్రభను చూపించారు.

దాదాపు 13,104 స్కూళ్లలో 3,4,5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు. దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు సైతం 5,907 స్కూళ్ళకు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవుతారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షలమంది పిల్లలు హాజరు అవుతారని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో మురుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం ప్రభుత్వం పడుతున్న తపన, కృషి ఇలా సత్ఫలితాలను ఇస్తోందని విద్యాశాఖ పేర్కొంది.

ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యాబోధనపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్ సంస్కరణలకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఇలాగే జరిగి పిల్లల భవిష్యత్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

More News

Ram Charan:రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ

RRR మూవీతో రామ్‌చరణ్‌ క్రేజ్ ప్రపంచవ్యాప్తమైంది. మెగా పవర్‌స్టార్ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన చరణ్‌ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

Chandrababu:చంద్రబాబు ఎన్నికల హామీలకు విలువ ఉందా..? ప్రజలు ఏమనుకుంటున్నారు..?

ఎన్నికలు వచ్చాయంటే చాలు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ లేని హామీలు ఇస్తూ ఉంటారు.

Sashivadane:‘శశివదనే’ చిత్రం నుంచి ‘వెతికా నిన్నిలా ..’  సాంగ్ రిలీజ్

‘‘వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా

Sajjala:అభ్యర్థుల మార్పుపై స్పందించిన సజ్జల.. ఏమన్నారంటే..?

అధికార వైసీపీ కొంతమంది అభ్యర్థులను మారుస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.

Kavitha:తిహార్ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(Kavitha) మరో భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో