Tirumala:తిరుమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. రమణదీక్షితులు సంచలన ఆరోపణలు..

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసే వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆ వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందూవులకు ఆరాధ్య క్షేత్రమైన తిరుమలలో జరగుతున్న అక్రమాలపై మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు(Ramana Dikshitulu)తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వీడియోను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోస్టు చేశారు.

ఈ వీడియోలో రమణ దీక్షితులు మాట్లాడుతూ టీటీడీలో చాలా మంది క్రిస్టియన్‌లు ఉండటమే పెద్ద సమస్య అన్నారు. ఈవో ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని తెలిపారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని ఆరోపించారు. ధర్మారెడ్డిని చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడు.. వేషధారణ, మాట కూడా అంతే ఉంటుందన్నారు.

ఈ మధ్య కొత్త విషయం తెలిసింది... అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో ఓ జియ్యర్ లోపలకు వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని అంటారు. ఇప్పుడు ఉన్న జియ్యర్ తర్వాత వచ్చే రెండో జియ్యర్‌కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారు అని ఆరోపించారు.

అలాగే వివేకా హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డిని రక్షించడానికి లాబీయింగ్ కోసం ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారని రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. అలాగే పెద జియ్యర్, చిన జియ్యర్‌లు ధర్మారెడ్డికి సాస్టాంగ పడతారని.. ఇది చాలా మంది నమ్మరు కానీ నిజమన్నారు. పెద జియ్యర్, చిన జియ్యర్ వారానికి ఒకసారి ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి సాస్టాంగ నమస్కారం చేసి వస్తుంటారని, అలా చేయకపోతే వాళ్లకు ఇచ్చే మూడు, నాలుగు కోట్ల నిధులను నిలిపివేస్తారని తెలిపారు. డాలర్ శేషాద్రి ఉన్నప్పుడే ఒకసారి ఆపి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. బెంగళూరులో ఆర్కియాలజీలో పురుషోత్తమరెడ్డి అనే అధికారి ఉన్నాడనీ అతను పూర్తిగా ధర్మారెడ్డి మనిషి అన్నారు.

ఇక తిరుమల కిచెన్‌లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయన్నారు. గుట్కా ప్యాకెట్‌లు అన్నీ చింపి బయట పోస్తుంటారని తెలిపారు. దర్శనానికి వచ్చే జడ్జిలు, మినిస్టర్లు, ఆడిటర్‌లు, ఇలా అందరినీ లడ్లు ఇవ్వడం, శాలువాలు కప్పి మేనేజ్ చేస్తారన్నారు. వాళ్లను ఎయిర్ పోర్టు వరకూ వెళ్లి దించేసి వస్తారని చెప్పారు. టీటీడీ అధికారులు అర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబితే వినరు. సీఏజీ చెబితే ఒప్పుకోరు. సమాచార శాఖ చట్టం మేము ఒప్పుకోమంటార.. ఎందుకంటే మేము గవర్నమెంట్ కాదంటారు. మళ్లీ ఈవో, చైర్మన్, డైరెక్టర్‌లు అన్నీ నియామకాలు ప్రభుత్వమే చేస్తుంది.

తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారు. అంతకు ముందు రాతి బండలు ఉండేవి అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెయ్యి కాళ్ల మండపం గానీ, దేవ మండపం కానీ అన్నీ నిధుల కోసమే తవ్వారని ఆరోపించారు. తిరుమల ఆలయం లోపలికి క్రేన్, గోడలకు డ్రిల్లింగ్ చేసి నాశనం చేస్తున్నారన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఏమి జరగడం లేదని ఆరోపించారు.

అలాగే శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. స్వామివారి ఎత్తున బట్టి ఎంత నైవేద్యం పెట్టాలనేది ఉంటుందన్నారు. రోజు ఎంత మంది వచ్చారు. ఎంత మంది గుండ్లు కొట్టించుకున్నారు. హుండీ కలెక్షన్ ఇంత వచ్చిందని అనే విషయాలు బయటకు చెబుతారు కానీ ప్రతి రోజు వచ్చే బంగారం, వెండి ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, సభ్యులు చెవిరెడ్డి ఏ ఆఫీసర్ వస్తే వారికి సరెండర్ అవుతుంటారన్నారు. గోవిందరాజ స్వామి విమాన గోపురం సంప్రోక్షణకి మూహూర్తం పెట్టడానికి ధర్మారెడ్డి జీయ్యంగార్‌ను పిలిపించాడని, అక్కడ అర్చకుడు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేదానికి జియ్యంగార్‌కు ఏమి సంబంధం అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. సీఎం జగన్ వంద శాతం దెబ్బతింటాడని.. అది ఎప్పుడు అనేది చూడాలన్నారు.

అయితే ఈ వీడియో వైరల్‌ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో ఉన్న వాయిస్‌ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ఆయన ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో తనకు ఉన్న సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి తానంటే అసూయని చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని స్పష్టంచేశారు.

రమణ దీక్షితులు మాట్లాడిన వీడియోపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలకు రమణ దీక్షితుల వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయన్నారు. అలాగే ఈ వ్యాఖ్యలపై స్పందించాలని.. తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మరి ఈ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

టీవీ5 సాంబశివరావుపై భూకబ్జా ఆరోపణలు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు..

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుకు సంబంధించిన ఓ వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న

Nikhil: తండ్రి అయిన హీరో నిఖిల్.. నెటిజన్లు శుభాకాంక్షలు..

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రయ్యారు. ఆయన భార్య డాక్టర్‌ పల్లవి వర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడిని ముద్దాడుతున్న ఫొటోను

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే.. నాయకులకు పవన్ పిలుపు..

వచ్చే ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చుపెట్టాల్సిందే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కనీసం భోజన ఖర్చులైనా పెట్టుకోరా అని ప్రశ్నించారు.

Bhamakalapam 2:‘భామాకలాపం2’ సంచలనం.. ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..

జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం 2' ఓటీటీలో అదరగొడుతోంది.

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గం ఇదే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భీమవరం పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు.