Somesh Kumar:సోమేశ్ కుమార్‌కు కీలక పదవిని కట్టబెట్టిన కేసీఆర్.. కేబినెట్ ర్యాంక్, ఏ పోస్ట్ అంటే..?

  • IndiaGlitz, [Tuesday,May 09 2023]

మాజీ సీఎస్ , రిటైర్డ్ ఐఏఎస్ సోమేశ్ కుమార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు సోమేశ్ ఈ పదవిలో వుంటారు. అలాగే ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది.

సోమేశ్‌కు అపార పరిపాలనా అనుభవం:

కాగా.. 1989 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్, రెవెన్యూ , కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, ఏపీ అర్బన్ సర్వీస్‌లో ప్రిన్సిలప్ సెక్రటరీ హోదాలో పనిచేశారు. బోధన్ సబ్ కలెక్టర్‌గా, నిజామాబాద్, అనంతపురం జిల్లా కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు. 2020 జనవరి 1 నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సీనియర్ అధికారి అజయ్ మిశ్రా ఉన్నప్పటికీ కేసీఆర్ సోమేశ్ వైపు మొగ్గుచూపారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయింపు:

నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ కేంద్రం ఉత్తర్వులు నిలిపివేస్తూ సోమేష్ కుమార్‌ను తెలంగాణలో కొనసాగిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ ఆదేశాలను కొట్టివేసింది. తక్షణం ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లాలని.. అక్కడి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

వీఆర్ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్ :

హైకోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, తెలంగాణ ప్రభుత్వాలు సోమేశ్ కుమార్‌ను రిలీవ్ చేశాయి. దీంతో ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్, సీఎస్‌లను కలిసి రిపోర్ట్ చేశారు. అయితే తనకు ఏ పదవి కేటాయించవద్దని కోరడంతో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ వెంటనే ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ సీఎం జగన్, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆమోదముద్ర వేశాయి. దీంతో ఏడాది సర్వీస్ వుండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో సోమేశ్ .. బీఆర్ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ దీనికి భిన్నంగా సోమేశ్ కుమార్‌ను తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు కేసీఆర్.

More News

Ram Charan:విజయ్ దేవరకొండ బర్త్ డే.. నీ ఫ్యాన్స్‌ని ఖచ్చితంగా మెచ్చుకోవాలంటూ చరణ్ ట్వీట్, ఎందుకంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య తొలి నుంచి సుహృద్భావ సంబంధాలే వుండేవి.

Adipurush Trailer : ‘‘వేల ఏళ్ల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్పుకోవాలి’’.. ఆదిపురుష్  ట్రైలర్ వచ్చేసిందోచ్

భారతీయుల ఇతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’.

Kushi:'ఖుషీ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. విజయ్, సమంతల కెమిస్ట్రీ సూపర్బ్

శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషీ’’.

Inter Results:తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల .. బాలికలదే పైచేయి, ఉత్తీర్ణత శాతం ఏంతంటే..?

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

Katha Venuka Katha:మే 12న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ రిలీజ్

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.