క‌స‌బ్ దుశ్చ‌ర్య‌.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించిన మాజీ అధికారి

  • IndiaGlitz, [Tuesday,February 18 2020]

12 ఏళ్ల క్రితం భార‌త‌దేశం చ‌రిత్ర‌లో మార‌ణ హోమాన్ని ఇంకా ఎవ‌రూ మ‌ర‌చిపోయి ఉండ‌రు. మన దేశ ఆర్థిక‌ రాజ‌ధాని ముంబైపై క‌స‌బ్ అత‌ని అనుచ‌రులు తెగ‌బడ్డారు. భీక‌ర పేలుళ్ల‌తో అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబా సంస్థ క‌స‌బ్‌ను ఓ హిందువు అని చూపించేలా ప‌థ‌కం వేసింది. అందుకోసం అత‌ని కుడి చేతికి ఎర్రని దారం క‌ట్టింది. అతనికి స‌మీర్ దినేశ్ చౌద‌రి అనే ఐడీ కార్డుని క్రియేట్ చేసింది. ఇదంత ఎందుకు చేశారంటే అత‌ను ఒక హిందువు అని నిరూపించే ప‌నిలో భాగంగానే చేశారు. ఈ విష‌యాన్ని మాజీ ముంబై పోలీస్ క‌మీష‌న‌ర్ రాకేష్ మ‌రియా త‌ను రాసిన లెట్ మీ సే ఇన్ నౌ అనే పుస్త‌కం ద్వారా తెలియ‌జేశారు.

భుజాని బ్యాగ్ వేసుకుని తుపాకీ ప‌ట్టుకుని వెళ్తున్న క‌స‌బ్ ఫొటోను బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోలో త‌న చేతికి ఎర్ర‌దారం చూడొచ్చు. ఈ ఫొటోను ద్వారా హిందూ ఉగ్ర‌వాదం అనే అంశాన్ని లేవ‌నెత్తి అంత‌ర్జాతీయంగా భార‌త‌దేశానికి చెడ్డ పేరు తీసుకు రావాల‌నేది పాకిస్థాన్ కుటిల ప్ర‌య‌త్నం. అయితే క‌స‌బ్ పాకిస్థాన్‌కు చెందిన‌వాడ‌ని తెలిసిపోయింది. క‌స‌బ్‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. ఆ ప‌నిని దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్‌కు అప్ప‌గించారు. అయితే ల‌ష్క‌రే ప‌ప్పులేం ఉడ‌క‌లేదు. రెండేళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత 2010లో క‌స‌బ్‌ను ముంబై ట్రైల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. క‌స‌బ్ ఈ తీర్పుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల‌కు వెళ్లినా చుక్కెదురైంది. 2012, న‌వంబ‌ర్ 21న పుణేలోని ఎర‌వాడ జైలులో క‌స‌బ్‌ను ఉరితీసిన సంగ‌తి తెలిసిందే.