బ్రేకింగ్: కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ప్రముఖ రాజకీయ నేతలు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జులై 29న ఆయన చికిత్స నిమిత్తం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పదిరోజుల చికిత్స అనంతరం నేడు ఆయన తుదిశ్వాస విడిచారు. నంది ఎల్లయ్య 1942 జూలై 1న హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో జన్మించారు. లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు విజయం సాధించగా... ఒకసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఆయన పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నంది ఎల్లయ్య మరణ వార్తను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

More News

కేరళ విమాన ప్రమాదం: గర్భిణి సహా 23 మంది పరిస్థితి విషమం

కేరళ విమానం ప్రమాదానికి గల కారణాలతో పాటు అన్ని వివరాలనూ అధికారులు సేకరిస్తున్నారు.

విమాన ప్రమాదానికి కారణాలివేనా?

కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గల కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.

తెలంగాణలో కొత్తగా 2256 కేసులు...

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

క‌రోనా వైర‌స్‌కు అస‌లైన ఆయుధం ప్లాస్మా:  చిరంజీవి

‘‘ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు.

రెమ్యున‌రేష‌న్‌తో నిర్మాత‌కు షాకిచ్చిన న‌య‌న‌తార‌!!

కోలీవుడ్ నిర్మాత‌ల ద‌గ్గ‌ర న‌య‌న‌తార ఎంత రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తుందో తెలియ‌దు కానీ..