Harirama Jogaiah:జనసేనలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేఖల ప్రకంపనలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు వేగంగా రాజుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అంచనా వేయడం కష్టమౌతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ హరిరామజోగయ్య పేరిట లేఖలు జనసేన పార్టీలో కాక రేపుతున్నాయి. ఏ లేఖ నిజమైనదో.. ఏది ఫేక్‌నే అర్థం కాకుండా ఉంది. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జోగయ్య ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అది విడుదలైన కాసేపటికే పవన్ కల్యాణ్ నుంచి తనకు స్పష్టమైన సమాచారం అందిందని.. లోకేష్ చెప్పినట్లుగా సీఎం నిర్ణయం జరగలేదని తెలిసిందంటూ మరో లేఖ విడుదలైంది. గత ఎన్నికల్లో పది వేలకు పైగా ఓట్లు వచ్చిన అరవై నియోజకవర్గాలను జనసేన పార్టీ తీసుకుని పోటీ చేయాలని ఆయన సూచించారు. జనసైనికులు అందరూ ఓపికగా ఉండాలని ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా తాజా హరిరామజోగయ్య పేరుతో మరో లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాపులకు అండగా నిలబడతాడని భావించిన పవన్.. చంద్రబాబు పంచన చేరి.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని అందులో ఉంది. పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా ఉందని.. ఇక కాపులు ఉపేక్షిస్తే లాభం లేదని..మనం గళం విప్పాలి.. మన గొంతు వినిపించాలి.. పిడికిలి బిగించాలి.. ఉనికిని కాపాడుకోవాలి.. అధికారంలో మన వాటా మనం తీసుకోవాలి అంటూ కాపులకు విజ్ఞప్తి అంటూ ఆయన రాసినట్లు లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ లేఖపై తాజాగా ఆయన స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ తన నుంచి వచ్చింది కాదని మరో లేఖ విడుదల చేశారు. టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు ‘కాపు సామాజిక వర్గానికి ఒకవిన్నపం’ అంటూ తన పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని మండిపడ్డారు. జనసైనికులు దీనిని గమనించాలని స్పష్టంచేశారు. వైసీపీ సానుభూతిపరులు చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్నారని.. వారి ట్రాప్‌లో జనసైనికులు పడొద్దని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కల్యాణ్ సీఎం పీఠం అధిష్టించే వరకు అందరూ ఆయన వెంట ఉండాలని విజ్ఙప్తి చేశారు. మొత్తానికి ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com