Janasena:త్వరలోనే జనసేనలోకి మాజీ మంత్రి.. అక్కడి నుంచి పోటీ..!

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్‌లు ఎక్కువైపోతున్నాయి. అయితే ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు టీడీపీ- జనసేన పార్టీల్లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఇరు పార్టీల్లో చేరారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapally Subbarayudu) జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో స్వప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే పవన్‌ కళ్యాణ్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

సినిమాల్లో కష్టపడి సంపాందించిన తన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకు ఆర్ధిక సహాయం అందిచిన వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని కొనియాడారు. అలాగే రాజధాని అమరావతి విషయంలో, విశాఖ రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం ఆయన నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో యువతకు ఆరాధ్య నాయకుడని తెలిపారు. అందుకే పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరనున్నట్లు కొత్తపల్లి ప్రకటించారు. దీంతో గోదావరి జిల్లాల జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడం శుభపరిణామని పేర్కొంటున్నారు.

కాగా సీనియర్ రాజకీయ నాయకుడైన కొత్తపల్లి 1989 అసెంబ్లీ ఎన్నికలో తొలిసారి నర్సాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి వరుసగా 1994, 1999, 2004 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014లో తిరిగి టీడీపీలో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. తదుపరి 2019లో వైసీపీలో చేరారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా ఆ పార్టీని కూడా వీడారు. ప్రస్తుతం జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే ఆయన నర్సాపురం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అక్కడ బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్దిగా ప్రచారంలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్తుందని తెలుస్తోంది. తాజాగా సుబ్బారాయుడు కూడా పార్టీలో చేరనుండటంతో సీటు ఎవరికి దక్కనుందనే ఆసక్తి మొదలైంది. కానీ జనసేన నేతలు మాత్రం కొత్తగా పార్టీలో చేరే వారికి ఎలాంటి సీట్లు ఉండవని తమ అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పినట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉభయగోదావరి జిల్లాల్లో జనసేనకు రోజురోజుకు బలం పెరుగుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More News

బైజూస్ రవీంద్రన్‌పై ఈడీ లుక్ ఔట్ నోటీసులు.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు.

కరోనా కాలంలో ఎన్నో స్టార్టప్ కంపెనీలు లాభపడ్డాయి. లాక్‌డౌన్ సమయాన్ని కొన్ని స్టార్టింగ్ కంపెనీలు సద్వినియోగం చేసుకున్నాయి. తమ ఉత్పత్తులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి.

YS Sharmila:కాంగ్రెస్ చేపట్టిన 'ఛలో సెక్రటేరియట్'లో ఉద్రిక్తత.. వైయస్ షర్మిల అరెస్ట్..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. దగా డీఎస్సీ కాదు..

Sharmila:జగన్‌ పాలన కన్నా చంద్రబాబు పాలనే బెటర్.. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్..

మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో సెకట్రేరియట్‌' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది.

Chandrababu: అలవికాని హామీలు ఎందుకు.. మాటిస్తే ఎన్టీఆర్‌లా నిలబడాలి.. చంద్రబాబుకు ప్రశ్నల వర్షం..

ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు దూకుడు పెంచాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌ చేతికి రెండు ఉంగరాలు.. ఎందుకో తెలుసా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల