మాజీ మంత్రి శ్రీవిష్ణుప్రసాదరావు కన్నుమూత

  • IndiaGlitz, [Sunday,December 27 2020]

మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు(90) ఆదివారం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఊపరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఆయనను చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీవిష్ణుప్రసాదరావు నేడు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విష్ణుప్రసాదరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన.

శ్రీవిష్ణుప్రసాదరావు 18 సంవత్సరాల పాటు కాట్రేనికోన గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా సేవలందించారు. 1972లో తొలిసారిగా అల్లవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1977లో ఇందిరా కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి రెండోసారి సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే ఆయన 1978లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్‌శాఖా మంత్రిగా పని చేశారు. శ్రీవిష్ణుప్రసాదరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖుుల సంతాపం వ్యక్తం చేశారు.

More News

‘రాధేశ్యామ్’ విడుద‌లపై నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారా?

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

విజయనిర్మల మనవడు శరణ్ - సినెటేరియా మీడియా వర్క్స్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల మనవడు శరణ్

ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్..

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఆదివారం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రజినీ ఆరోగ్య రీత్యా పలు సూచనలు చేసిన మీదట ఆయనను నేడు వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

ఆలియాపై కేసు నమోదు...

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆలియా భట్ 'గంగూబాయ్‌ కతియావాడి' అనే సినిమాలో నటిస్తోంది.

చందమామపై స్థలాన్ని కొని భార్యకు కానుకిచ్చాడు..

భార్యకు పెళ్లిరోజు కానుక ఏమివ్వాలా? అని ఓ భర్త ఆలోచించాడు. ఏముంటుంది.. ఏ బంగారు నెక్లెస్సో..