బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువైన సాంబశివరాజు 1958లో సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు. 1989-94లో మంత్రిగా సాంబశివరాజు బాధ్యతలు నిర్వహించారు.1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com