బాహుబలి రికార్డ్‌లే కాదు..: ప్రభాస్‌పై మాజీ మంత్రి ప్రశంసలు

  • IndiaGlitz, [Thursday,April 02 2020]

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేతలు, నటీనటులు, వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు ముందుకొచ్చి తమ వంతుగా సాయం చేశారు. వీరిలో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు.. ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కలిపి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయమే.

బాహుబలి రికార్డ్స్‌లోనే కాదు..

ప్రభాస్ విరాళంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రెబల్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘బాహుబలి’ చిత్ర రికార్డుల్లోనే కాదు.. ‘కరోనా’ విరాళాల్లోనూ తెలుగు సినీ రంగంలో ప్రభాస్ ముందుండటం అభినందనీయం. చిన్నవయస్సులోనే పెద్ద మనస్సు చాటుకుంటూ ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణల సీఎంల సహాయనిధికి కలిపి కోటి రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం’ అని తన ట్విట్టర్ వేదికగా ప్రభాస్‌ను సోమిరెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రభాస్ విరాళం ప్రకటించిన తాలుకూ ప్రకటన, యంగ్ రెబల్ స్టార్ ఫొటోను కూడా సోమిరెడ్డి షేర్ చేశారు. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

More News

కరోనాపై పోరుకు విప్రో అధినేత భారీ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ చేయడం..

కరోనా సోకిందని వివక్ష చూపొద్దు.. ప్రేమ చూపండి : జగన్

తాడేపల్లి : కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తించి వైద్యం అందించడంలో సమగ్ర విధానం అవలంభిస్తున్నామని తెలిపారు.

నిద్రపోయి పాపులర్ అయ్యాడు.. తీరా చూస్తే..!

టైటిల్ చూడగానే.. ఇదేంటి ఇందులో విచిత్రం ఏముంది..? అందరికీ నిద్రొస్తుంది.. నిద్రపోతారు కదా.. ఇందులో కొత్త విషయం ఏముంది అనుకుంటున్నారా..?

క‌రోనా క‌ష్టాలు .. ఎడారిలో చిక్కుకున్న స్టార్ హీరో

క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా దేశ‌మంతా ముఖ్య‌మైన ప‌నులు, ర‌వాణా, ప్ర‌ధాన ఆర్థిక కార్య‌కలాపాలు అన్నీ స్తంభించాయి. సినిమా ప‌రిశ్ర‌మ అయితే షూటింగ్‌ల‌న్నింటినీ ఆపేశాయి.

షాకింగ్: మర్కజ్ చీఫ్ ఆడియో టేపుల కలకలం.. రంగంలోకి దోవల్!

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే చర్చ. ఈ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ కావడంతో ప్రపంచ