KTR: యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లం: కేటీఆర్

  • IndiaGlitz, [Monday,January 01 2024]

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల అవుతోంది. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే తమ ఓటమిని ఇప్పటికీ గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. హ్యాట్రిక్ మిస్ అయ్యామని తెగ మదనపడిపోతున్నారు. పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిన తమ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారని రకరకాల విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజిన్ పోస్ట్ చేసిన ట్వీట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక విశ్లేషణలు, ఫీడ్‌బ్యాక్‌లు తీసుకున్నాను. కానీ అందులో తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంపై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు యూట్యూబ్ చానళ్లు పెట్టుకుని ఉంటే మంచిదనే అభిప్రాయం కేటీఆర్ వ్యక్తం చేశారు.

అయితే కేటీఆర్ ట్వీట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. పార్టీ అభిమానులు ఆయన అభిప్రాయం కరెక్టేనని కామెంట్స్ చేస్తుండగా.. మిగిలిన పార్టీ అభిమానులు, న్యూట్రల్‌గా ఉండే వారు మాత్రం విమర్శలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే శిరోధార్యం అని.. ప్రజా తీర్పును హుందాగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫేక్ ఛానల్స్ పెట్టినంత మాత్రాన గెలవలేరని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

కేటీఆర్ ట్వీట్‌పై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉంది అని.. ఆ పార్టీనే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుకుందని గుర్తుచేస్తున్నారు. యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయరెన్స్‌లు, బిగ్‌బాస్ కంటెస్టులు చేత విపరీతంగా ప్రచారం చేసిందని చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి విపరీతంగా ప్రచారం చేసినంత మాత్రాన ప్రజల తీర్పు ఏం మారదని పేర్కొంటున్నారు. అసలు సోషల్ మీడియాను ఎక్కువ ఫాలో అయ్యే అర్బన్ ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు కూడా సరిగా వినియోగించుకోలేదని వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువగా గ్రామాల్లోనే డ్యామేజ్ అయిందనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలని సూచిస్తున్నారు

More News

Komati Reddy: సీఎం రేవంత్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొమ్మిదన్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. అంతకుముందు ఉప్పు నిప్పులుగా ఉండే నాయకులు

Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'దేవర' అప్టేడ్ వచ్చేసింది..

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) అభిమానులకు న్యూ ఇయర్ ట్రీట్ వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్టేడ్ వచ్చింది.

ప్రజాపాలనతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ ప్రభుత్వం

ప్రజలకు కష్టాలు లేకుండా సులభంగా పథకాలు అందించడం ఏ ప్రభుత్వం పని తీరునైనా తెలియజేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా

Former DSP Nalini:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని.. ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.