Kodali Nani:ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానుల ఓవరాక్షన్ .. తారక్ ప్లేస్‌లో నేనుంటేనా : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నిన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలకు నేతలు, ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ ఆదివారం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, నేతలు అన్నగారి ఘాట్‌కు పోటేత్తారు. ఈ క్రమంలోనే ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం తాత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలో అభిమానులపై జూనియర్ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇవ్వబోయిన అభిమానులు :
కారు దిగి సమాధి వద్దకు వచ్చే వరకు ఎన్టీఆర్ ఎంతో ఇబ్బందిపడ్డారు. అభిమానులు భారీగా రావడంతో ఎన్టీఆర్ నడవలేకపోయారు. అయినప్పటికీ కోపాన్ని బయటకు కనిపించకుండా తాత సమాధి వద్ద ఆయనకు అంజలి ఘటించారు జూనియర్. అయితే ఓ పుష్ప గుచ్చాన్ని సమాధిపై వుంచేందుకు కొందరు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్ దానిని చేతితో పక్కకు నెట్టేసి.. గులాబీ రేకులను తీసుకుని నమస్కరించారు. మరోసారి పుష్పగుచ్చం ఇచ్చేందుకు అభిమానులు ప్రయత్నించగా.. దాన్ని కూడా నెట్టేసి జూనియర్ వెళ్లిపోయారు. ఈ సమయంలో ఎన్టీఆర్ ఫేస్‌లో కోపం, అసహనం, అసంతృప్తి వంటివి స్పష్టంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా చేతిలో దండ లాక్కుంటే మండదా :
ఈ నేపథ్యంలో ఆ ఘటనపై స్పందించారు వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లేటప్పుడు ఆయన మనవడు పువ్వో, పుష్పగుచ్చమో, దండో తీసుకెళ్లకుండా వుంటాడా అంటూ ప్రశ్నించారు. పెళ్లికో, చావు ఇంటికో వెళ్లినప్పుడు దండో, బోకేనో తీసుకెళ్తానని.. తన చేతిలోది లాక్కొని.. నీ చేతిలోది ఇస్తే ఎలా వుంటుంది అంటూ నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ మంచోడు కాబట్టి చేయి పక్కకు జరిపారని.. అదే తానైతే నువ్వెవడ్రా పిచ్చినా కొడుకులా వున్నవంటూ గద్దించేవాడినని కొడాలి నాని తెలిపారు.
ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు కుట్ర :
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయనతో సినిమాలు చేయవద్దని నిర్మాతలను బెదిరిస్తున్నారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల మీటింగ్‌కు ఎన్టీఆర్ రాలేదని.. ఆయన తల్లిని తిట్టిస్తున్నారని.. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా అంటూ ఆయన మండిపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com