Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నామినేషన్లు తిరస్కరణ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఈ ప్రక్రియలో కీలక వ్యక్తుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం విశేషం. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తు్న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్, కోరుట్లలో బీఆర్ఎస్ తరపున విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బరిలోకి దిగుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వీరు డమ్మీ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వాటిని అధికారులు తిరస్కరించినట్లు సమాచారం.
రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. ఈ లోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఆరోజు సాయంత్రం వరకు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ గడువులోపు చాలా మంది అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో వివిధ పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా, రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. ఓట్లు చీలకుండా ఆయా అభ్యర్థులు వారిని బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా కోరనున్నారు. దీంతో బుధవారం రాత్రికి ఎన్నికల బరిలో మొత్తం ఎంత మంది అభ్యర్థులు ఉన్నారో తేలనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments