Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నామినేషన్లు తిరస్కరణ

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు నమోదయ్యాయి. ఇందులో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఈ ప్రక్రియలో కీలక వ్యక్తుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం విశేషం. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భార్య జమున, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

నాగార్జునసాగర్‌‌లో జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తు్న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరపున ఈటల రాజేందర్, కోరుట్లలో బీఆర్ఎస్ తరపున విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ బరిలోకి దిగుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వీరు డమ్మీ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వాటిని అధికారులు తిరస్కరించినట్లు సమాచారం.

రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఉంది. ఈ లోపు పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఆరోజు సాయంత్రం వరకు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ గడువులోపు చాలా మంది అభ్యర్థులు నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో వివిధ పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా, రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. ఓట్లు చీలకుండా ఆయా అభ్యర్థులు వారిని బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా కోరనున్నారు. దీంతో బుధవారం రాత్రికి ఎన్నికల బరిలో మొత్తం ఎంత మంది అభ్యర్థులు ఉన్నారో తేలనుంది.

More News

Bigg Boss Telugu 7: నామినేషన్స్ చేయడానికి వణికిన రతిక, బిగ్‌బాస్ వార్నింగ్.. చివరికి శోభా - ప్రియాంకలతో గొడవ

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతోంది. గత వారం భోలే షావళి ఎలిమినేట్ కాగా, దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి.

Hi Nanna Director: నాని 'హాయ్ నాన్న' డైరెక్టర్.. ఫేమస్ యూట్యూబర్ అన్నయ్య అని తెలుసా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథ నచ్చితే చాలు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో

Drohi Review: మర్డర్ చుట్టూ తిరిగే 'ద్రోహి'.. మూవీ రివ్యూ

అజయ్ (హీరో సందీప్) ఒక వ్యాపారవేత్త. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి రకరకాల వ్యాపారాలు చేస్తే వుంటాడు. ఎంత కష్టపడుతున్నా.. ఎఫర్ట్ పెడుతున్నా బిజినెస్‌లో నష్టపోవడమే కానీ కలిసి రావడం మాత్రం జరగదు.

Anukunnavanni Jaragavu Konni: 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' మూవీ రివ్యూ

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ కారణంగా ప్రపంచం నలుమూలలా వున్

KCR: వైఎస్ షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.