మంత్రి బొత్స మాటలు.. మాజీ మంత్రికి అర్థం కాలేదట

  • IndiaGlitz, [Friday,August 30 2019]

ఏపీ రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతుల్లో ఆందోళన రేపాయి. అంతేకాదు రాజధాని తరలిస్తే అస్సలు ఒప్పుకోమని ఓ వైపు రైతులు మరోవైపు అమరావతిలో భూములున్న మాజీ మంత్రులు, తెలుగు తమ్ముళ్లు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో బొత్స కొందరికి సవాల్ విసిరి మరీ ఎకరాల భూముల లెక్కల చిట్టాను విప్పారు. లెక్క తేలిన తర్వాత నాలుక్కరుచుకున్న టీడీపీ నేతలు కొందరు మీడియా ముందుకు రావడం దాదాపు మానేశారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అయితే ఈయనకు మంత్రి బొత్స మాటలు అస్సలు అర్థం కాలేదట.

ఇదిగో మాజీ మంత్రి ఏమన్నారో చూడండి!

‘ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. బాలకృష్ణ అల్లుడు కాబట్టే భరత్‌పై ఏదో ఒక నింద మోపాలని మంత్రి ప్రయత్నం చేస్తున్నారు. భరత్‌ కంపెనీ భూములు ప్రభుత్వ ఆదీనంలో ఉన్నాయో లేదా ఎవరి ఆధీనంలో ఉన్నాయో మంత్రి బొత్స చెప్పాలి. కిరణ్ అయితే ఈ ఒప్పందాలన్నీ బొత్స మంత్రిగా ఉన్నప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో భూముల ఎంవోయూ జరిగింది. అంతే కాదు సీఆర్డీఏ పరిధి తెలియకుండా బొత్స మాట్లాడుతున్నారు. 14 నియోజకవర్గాల్లో సీఆర్డీఏ విస్తరించి ఉంటే మంత్రి హోదాలో ఉన్న బొత్స రాజధానిపై స్పష్టత ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు బొత్స ఏం మాట్లాడారో అర్ధం కావడం లేదని, ఆయన మాటలు అనువాదం చేయించుకుని విందామన్నా అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది’ అని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. మరి మాజీ మంత్రి వ్యాఖ్యలపై బొత్స, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

రాజధానిలో జనసేనాని.. ‘ఆళ్ల’ ప్రశ్నల వర్షం!

ఏపీ రాజధాని అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకులపై ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులపై, ఆర్ధిక విధానాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆల్‌ ది బెస్ట్‌ యూఎస్‌ కాన్సులేట్‌ : సీఎం జగన్

యూఎస్‌ కాన్సులేట్‌ పదో వార్షికోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి కరెంట్ షాక్!

అవును మీరు వింటున్నది నిజమే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పగానే పాక్ మంత్రికి సడన్‌గా కరెంట్ షాక్ కొట్టింది.

అబ్బే... తూచ్ ఆ సింగర్‌కు సల్మాన్ గిఫ్ట్ ఇవ్వలేదట

రాణు మోండాల్ అనే మహిళ.. పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ మీద పాడిన పాట ఓవర్ నైట్ సెలబ్రిటీగా మార్చేసిన విషయం విదితమే.