లైవ్‌లోనే విశ్వక్సేన్ను చెప్పుతో కొట్టాల్సింది .. సినిమాల్లోకి రానీయొద్దు : దానం నాగేందర్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో విశ్వక్సేన్ నటించిన ‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’’ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రాంక్ వీడియో వ్యవహారం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై పబ్లిక్‌ను డిస్ట్రబ్ చేస్తున్నారంటూ లాయర్ అరుణ్ కుమార్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం, తర్వాత దీనిపై టీవీ 9 ఛానెల్ డిబేట్ పెట్టడం, ఆ చర్చా కార్యక్రమంలో విశ్వక్సేన్ అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు యాంకర్ దేవి నాగవల్లిని ఉద్దేశిస్తూ అసభ్యపదాన్ని ఉపయోగించడం .. దీనిపై సీరియస్ అయిన యాంకర్.. విశ్వక్సేన్ను బయటకు వెళ్లిపోమనడం వెను వెంటనే జరిగిపోయాయి.
ఫ్యాన్స్.. నెటిజన్స్ విశ్వక్ సేన్‌కు అండగా నిలుస్తూ.. యాంకర్ దేవిపై ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకున్న హీరో విశ్వక్ సేన్.. చివరకు తాను ఎఫ్..అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందంటూ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న యాంకర్ దేవి నాగవల్లి.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోనికి తీసుకున్న మంత్రి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో టీవీ 9 స్టూడియోలో జరిగిన వివాదంపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. విశ్వక్ సేన్‌ని తాము హీరోగా గుర్తించటం లేదని స్పష్టం చేశారు. లైవ్‌లో అసభ్యకరమైన మాటలు మాట్లాడటం సరికాదని.. దేవి మంచి యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారని తెలిపారు. మీడియా ముందుకు, ఛానెల్ ముందుకు వెళ్లినప్పుడు రకరకాలైన ప్రశ్నలుంటాయని... వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడే టీవీల ముందుకు వెళ్లాలని నాగేందర్ హితవు పలికారు. సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ రోడ్లపై అరాచకం సృష్టించాడని... నిన్న టీవీలో విశ్వక్ సేన్ మాట్లాడిన దానిపై పోలీసులు సుమోటా కేసును నమోదు చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని.. విశ్వక్ సేన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.
యాంకర్ నాగవల్లి ఓ తప్పు చేశారు. తను ఎఫ్ అనే అక్షరం పలుకుతున్నప్పుడే చెప్పు తీసుకుని విశ్వక్ సేన్‌ను కొట్టాల్సిందని దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. మా మహిళలందరూ చెప్పులు తీసుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని... విశ్వక్ సేన్‌లాంటి దుర్మార్గుడిని సినిమాల్లోకి తీసుకోవద్దని ఆయన దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. సిగ్గు, లజ్జ లేకుండా మాట్లాడుతున్నాడని.. అమ్మ, చెల్లి నీ పక్కనుంటే అలాగే మాట్లాడుతావా అని విశ్వక్ సేన్‌పై ఫైరయ్యారు నాగేందర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com