ఎన్నికల ముందు టీఆర్ఎస్‌కు ఊహించని షాక్..!?

  • IndiaGlitz, [Saturday,January 11 2020]

కరీంనగర్: ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ వరుస షాక్‌లు తగులుతున్నాయ్. ఓ వైపు టికెట్ల కోసం అభ్యర్థులు గొడవ.. మరోవైపు టికెట్లు దక్కలేదని నేతలు పార్టీ మారుతున్నారు. దీంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ ప్రధాన అనుచరుడిగా, కరీంనగర్‌ మేయర్‌గా పనిచేసిన రవీంద్రసింగ్‌ సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

చేర్చుకోవాలా..? వద్దా..!?

టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని మాజీ మేయర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి రవీంద్రసింగ్‌తో బీజేపీ ఎంపీ బండి సంజయ్ చర్చలు జరుపుతున్నారని తెలిసింది. పార్టీలోకి తీసుకురావాలా? వద్దా..? అనేదానిపై పార్టీ సీనియర్ నేతలతో బండి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన ముఖ్య, సీనియర్ నాయకులతో బండి టచ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇదే జరిగితే..!
కాగా.. మంత్రి గంగులతో విబేధాలు తలెత్తడంతో మాజీ మేయర్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని కమలనాథులు భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు మారతాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే గంగులతో విబేధాల కారణంగా టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. ఎంపీ బండి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

More News

రవితేజకు కథను వినిపించడానికి రెడీ అవుతున్న మారుతి!

‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఇచ్చిన కిక్కులో డైరెక్టర్ మారుతి ఉన్నారు. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ చిత్రంగా

థమన్‌కు ఛాన్సులే ఛాన్సులు..

ఒక‌ప్పుడు థ‌మ‌న్ పేరు చెబితే సంగీత ప్రియులంద‌రూ పెద‌వి విరిచేవారు. అయితే ఇప్పుడు థ‌మ‌న్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తుండ‌టం విశేషం.

త్రివిక్రమ్ నాకు కొత్త బలాన్నిచ్చారు: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో చెక్కుచెదరని స్థానం పొందిన అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.

వాళ్ల సినిమాలు చూడొద్దు.. మానేయండి: అశ్వనీదత్

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న ఆందోళనలపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు.

చిరుకేం తెలుసు..? పవన్ నటిస్తే కోట్లే..  అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించి.. మూడు రాజధానులుంటాయేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి రైతులు, రైతు కూలీలు,