కలసి నటించబోతున్న మాజీ ప్రేమికులు..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ జంటలు ప్రేమించుకోవడం.. విడిపోవడం కామన్‌గానే జరుగుతుంటాయి. ఈ కోవలోనే రణభీర్ కపూర్, దీపికా పదుకొనెలు కలిసి నటించారు. హే జవానీ హై దివానీ, తమాషా చిత్రాల్లో కలిసి నటించారు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ ఇద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో విడిపోయారు. తర్వాత దీపికా ... రణవీర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రణభీర్ కపూర్‌తో దీపికా కలిసి నటించనుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందబోయే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్తో పాటు.. లవ్ రంజన్ దర్శకత్వంలో ఈ మాజీ ప్రేమికులు కలిసి నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. కొన్ని రోజులు ఆగితే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments