కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ఇంట్లో విషాదం.. మనుమరాలు ఆత్మహత్య
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. యడ్డీ మనుమరాలు సౌందర్య (30) బెంగళూరులోని ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. యడియూరప్ప రెండో కుమార్తె పద్మావతి కూతురే సౌందర్య . ఆమె భర్తతో కలిసి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నారు.
డాక్టర్ సౌందర్యకు, జిల్లా పంచాయితీ సభ్యుడు మరిస్వామి అన్న కుమారుడు డాక్టర్ నీరజ్‌కు 2018 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ పాప ఉంది. బెంగళూరు నగరంలోని వసంతనగర్ లోని మౌంట్ కార్మల్ అపార్ట్ మెంట్ లో డాక్టర్ నీరజ్, సౌందర్య దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్ నీరజ్ విధి నిర్వహణలో భాగంగా ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో సౌందర్య ఇంట్లోనే ఉన్నారు.
భర్త బయటకు వెళ్లిపోయిన తర్వాత తన గదికి వెళ్లిన సౌందర్య తలుపు వేసుకుంది. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి డోర్ కొట్టగా.. ఎంతకూ తలుపు తీయకపోవటంతో ఆమె నీరజ్‌కు సమాచారం అందించింది. దీంతో పరుగు పరుగున ఇంటికి వచ్చిన నీరజ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా సౌందర్య ఉరికి వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమెను దగ్గర్లోని మల్లిగే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
హైగ్రౌండ్స్ పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. సౌందర్య మృతదేహాన్ని శివాజీనగర్ లోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మై, పలువురు సీనియర్ మంత్రులు ఆసుపత్రికి చేరుకుని యడ్డీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అబ్బిగెరెలో వున్న నీరజ్ ఫామ్ హౌజ్‌లో సౌందర్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి వల్లనే సౌందర్య ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout