మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్ర‌సాద్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులను సన్నిహితులు చికిత్స నిమిత్తం యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగానే.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే ఎస్వీ ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఎస్వీ ప్ర‌సాద్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్‌గా ఎస్వీ ప్రసాద్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన సీఎస్‌గా పని చేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు.

అలాగే 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా నియమితులయ్యారు. తన కంటే 20 మంది సీనియర్ అధికారులున్నా.. ఎస్వీ ప్రసాద్‌నే సీఎస్ పోస్టు వరించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గానూ ఎస్వీ ప్ర‌సాద్ పనిచేశారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్ర‌సాద్ గుర్తింపు పొందారు. ప్రసాద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

More News

పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ బాటలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న

బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' సినిమాది స్పెషల్ ప్లేస్. అప్పటికి 'ఆది' లాంటి సక్సెస్ ఖాతాలో పడినా ఏదో వెలితి. దానికి ముందు 'సుబ్బు', తరువాత 'అల్లరి రాముడు', 'నాగ' ప్లాప్స్ ఎఫెక్ట్ ఉంది.

దేశంలో 54 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. 54 రోజుల కనిష్టానికి కేసుల సంఖ్య చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి..

హాలీవుడ్‌ స్టూడియోతో రాజమౌళి నెక్స్ట్

'బాహుబలి'తో రాజమౌళి రేంజ్ మారింది. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్ళారు. ఇండియాలో బాహుబలి ఏ రేంజ్ సక్సెస్ అయ్యిందో టాలీవుడ్ ఆడియన్స్‌కి తెలుసు.