బిగ్‌బాస్ 5 తెలుగు: మాజీ కంటెస్టెంట్స్ సందడి.. ఎవరొచ్చినా షన్నూ- సిరిలపైనే పంచ్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 5 తెలుగు రేపటితో ముగియనుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్‌కు ఎండ్ కార్డ పడనుంది. ఈ వారం మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీలతో, ఫన్నీ గేమ్ తో ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్.. ఈరోజు ఎపిసోడ్ కి గత సీజన్లలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న కొందరు ఎక్స్ హౌస్ మేట్స్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పంపించారు. మరి వారి చేసిన అల్లరి ఏంటో..? కంటెస్టెంట్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అయ్యారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
షో మొదలవ్వగానే.. మాజీ సీజన్ల కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. తొలుత ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా ఎలిమినేట్ అవుతారంటూ వారు సెటైర్ వేయడంతో అతడికి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆ తరువాత శివబాలాజీ.. షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ.. 'ఎక్కువ ఆలోచించొద్దు.. అన్నీ మర్చిపో..' అని అన్నాడు. దానికి మధ్యలో కలగజేసుకున్న హరితేజ 'ట్రోఫీ కూడా మర్చిపో అంటూ పంచ్ వేసింది.
తర్వాత ఒక పీపా పట్టుకుని హరితేజ ఊదితే ఆ పాటేంటో హౌస్మేట్స్ గెస్ చేయాలి. పాట సరిగ్గా గెస్ చేస్తే దానికి డ్యాన్స్ చేయాలి. దీనికి షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్ చేశారు. ఇది చూసిన హరితేజ వెంటనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటూ కామెంట్ చేసింది. దీనికి నొచ్చుకున్న శ్రీరామ్ సిరిని ఎలిమినేట్ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ పంచ్ వేశాడు. ఇక హరికథ చెప్పడంలో దిట్ట అయిన హరితేజ బిగ్‌బాస్ షో గురించి, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి కథ చెప్పి అందరికీ బై చెప్పారు.
ఇక సెకండ్ సీజన్ నుంచి గీతామాధురి, రోల్ రైడా కన్ఫెషన్ రూమ్ లో నుంచి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. ముందుగా రోల్ రైడా.. 'బయట ఎక్కడన్నా ఏదైనా ఎగురుతుంటే అది ట్రాక్టర్ ట్రాక్టర్ అని అంటున్నారు' అంటూ సిరిని ఆటపట్టించాడు. సన్నీ-మానస్ ఫ్రెండ్షిప్పై ప్రశంసల వర్షం కురిపించి, షన్నూ- సిరిలపై మాత్రం జోక్స్ వేశారు. నిన్నటినుంచి వీరి ముగ్గురికి బాగా కాలుతుందని.. శ్రీరామ్, సన్నీ, మానస్‌లపై ఫైరయ్యాడు షన్నూ. అయితే 'ఇది రెస్పాండ్ అయ్యే టైం కాదు.. విని పడేసే టైం' అని చెప్పింది సిరి. ఏ రిలేషన్ అయినా హౌస్ వరకేనని.. చెబుతూ షణ్ముఖ్ మీద మళ్లీ అలిగింది. ఇక ఎప్పటిలానే హగ్ ఇచ్చి ఆమెని యథావిధిగా కూల్ చేశాడు షణ్ముఖ్. దీనికి సన్నీ.. 'ఏంట్రా వీళ్లు.. ఎప్పుడు ఏం ఎమోషన్ వస్తాదో.. హగ్ గురు అయిపోతాడు చూడు మనోడు బయటకి వెళ్లాక' అంటూ కామెంట్ చేశాడు.
ఆ తర్వాత మూడో సీజన్ బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, కంటెస్టెంట్ శివజ్యోతి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ సన్నీ గురించి, శ్రీరామ్ గురించి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే షణ్ముఖ్, సిరిల గురించి చెప్పారు. శ్రీరామ్‌ని బయటకు వెళ్లాక ఏం చేస్తావని అడగ్గా,తాను హమీద కోసం వెతుకుతానని బదులిచ్చాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో హీలియం బెలూన్స్‌ను పీల్చమని చెప్పి.. వారితో డైలాగ్స్ చెప్పించారు. తర్వాత టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడించి అందరి దగ్గరా వీడ్కోలు చెప్పారు.
వీరి తర్వాత ఐదో సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్ , అరియానా సందడి చేశారు. వచ్చి రావడంతోనే శ్రీరామ్ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్ ప్లే చేయడంతో అతడు సంబరపడిపోయాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ వీరు సరదాగా కొన్ని ప్రశ్నలడిగారు. డేటింగ్ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు. ఆ తర్వాత అరియానా, అఖిల్ ఓ ఫోటో చూపించి, అది హౌజ్‌లో ఎక్కడుందో చెప్పాల్సి ఉంది. అది సిరి తీసుకోవాలనుకున్న ఫోటో కావడంతో ఆమె సర్ప్రైజ్ అయ్యింది. ఆ ఫోటోలో షణ్ముఖ్- సిరి ఏ పాటకైతే డ్యాన్స్ చేశారో హౌస్మేట్స్ అంతా మరోసారి ఆ సాంగ్‌కి స్టెప్పులేశారు.
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సన్నీ, సిరి, శ్రీరామ్, షణ్ముఖ్,మానస్‌లలో ఎవరు విన్నర్ అనేది ఆసక్తికరంగా మారింది. ప్రిడిక్షన్స్, బిగ్‌బాస్ నుంచి అందుతున్నసమాచారం మేరకు సన్నీ విన్నర్ అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేను నిర్వాహకులు గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. రామ్‌చరణ్, అలియాభట్, నాని, సాయిపల్లవి సందడి చేయబోతున్నారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments