అక్టోబర్ 8న `ఎవ్వరికీ చెప్పొద్దు` విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకబ్బాయి, అమ్మాయి.. ఇద్దరి మధ్య ప్రేమ అబ్బాయిని ఇష్టపడ్డ అమ్మాయి.. తన ప్రేమను మాత్రం అతనికి చెప్పదు. అబ్బాయి ఫోన్ చేసినా తిడుతుంది.. చేయకపోయినా తిడుతుంది. అయితే ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య ఉండే అంతరం కులం.. మరి ఈ అంతరాన్ని దాటి ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యారా? లేదా? అనేది తెలుసుకోవాలంటే `ఎవ్వరికీ చెప్పొద్దు` సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ `ఎవ్వరికీ చెప్పొద్దు`. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ డిఫరెంట్‌గా ఉందంటూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా
హీరో, నిర్మాత రాకేశ్ వర్రె మాట్లాడుతూ - ``హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. దిల్‌రాజుగారు మా సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నాం . ఆయన అందిస్తున్న సహకారానికి .. ఆయనకు స్పెషల్ థాంక్స్. ట్రైలర్ చూసిన వాళ్లందరూ బావుందని అంటున్నారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout